సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా ,వినతిపత్రం అందజేత..
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 21
తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట భారీ నిరసన వ్యక్తం చేసి ఓ వినతి పత్రాన్ని అందజేసినట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ,దళిత బంధు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు అవినీతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం, నాయకులు తడవేణి రవి, జూల లచ్చయ్య, దొమ్మటి వెంకటస్వామి,కనకం మొగిలి, అన్నారపు లక్సమాన్, చిన్నవేణి హరీష్, గోలి నిర్మల, కూరపాటి రాజ శేఖర్, శాలిగాట్టి సారయ్య, బలిజ బుచ్చవ్వ, అలవాలా లలిత, sd హైమేదే, షేక్ హాలిమ్, లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు అర్జీదారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు
సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా ,వినతిపత్రం అందజేత.




