మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు వూరే లక్ష్మణ్ ఒక ప్రకటనలో కోరారు ఆర్యవైశ్య సోదర, సోదరీమణులకు తెలియజేయునది ఏమనగా మీరందరూ అభిమానించే వ్యక్తి వూరే లక్ష్మణ్ మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మన ఆర్యవైశ్య పితామహుడు కొనిజేటి రోశయ్య గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా ఎన్నో ఉన్నతమైన పదవులను ఆర్యవైశ్య సోదరులకు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది మన ఆర్యవైశ్యుల అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేయాలని ఆర్యవైశ్య నాయకులు వూరే లక్ష్మణ్ కోరారు భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీజీ దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు రాబోయే సాధారణ ఎన్నికలలో రాహుల్ గాంధీజీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని తెలిపారు ఉప ఎన్నికలలో మన ఆర్యవైశ్య సోదరుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయాలని విజ్ఞప్తి చేసారు