చేర్యాల మండల మున్నూరుకాపు యువజన సంఘం కన్వీనర్ గా గుర్జకుంట గ్రామానికి చెందిన కాశెట్టి పాండు పటేల్ ఎన్నికైనట్లు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రకటించారు. బుధవారం ఈమేరకు చేర్యాల ప్రాంత నాయకుల చేతుల మీదుగా నియామక పత్రం జారీ చేశారు. ఈకార్యక్రమంలో మున్నూరు కాపు మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడెం రజిత పటేల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాడెం కృష్ణ మూర్తి పటేల్, చేర్యాల మున్నూరుకాపు మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పటేల్, మండల నాయకులు అనంతుల మల్లేశం పటేల్, చేర్యాల పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు వెలగల దుర్గయ్య పటేల్, రాష్ట్ర సంస్థ కార్యదర్శి యేషబోయిన నాగరాజు పటేల్, ఆది వెంకటేశం పటేల్ పాల్గొన్నారు.




