మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి – పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మల్క రామస్వామి మాట్లాడుతూ.. మున్నూరు కాపులు ఎదురుకొంటున్న సమస్యలపై అలాగే మున్నూరు కాపుల ప్రధాన డిమాండ్ మున్నూరు కాపు ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రతి జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ నుంచి అధిక సంఖ్యలో ఉత్తరాలు పంపాలని రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పిలుపు మేరకు అందరూ కలిసి కట్టుగా పంపించి మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో రామగిరి మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కుడిది చలం, చందనపూర్ విలేజ్ ప్రాసిడెంట్ కొoడ శ్రీనివాస్, కల్వచర్ల విలేజ్ ప్రెసిడెంట్ తోట శంకర్, కుడిది వెంకటేష్, దేవ వెంకటేష్, లకాకుల శ్రీనివాస్, దొనేటి లచ్చన్న, దొట జితేంద్రర్, చిల్వరల ప్రసాద్, ఇసంపల్లి శ్రీనివాస్ పాల్గొని రామగిరి మండలం నుంచి అధిక సంఖ్యలో ఉత్తరాలని మున్నూరు కాపు కుల బాంధవులతో పంపిస్తామని తెలిపారు.

తాజావార్తలు