Tuesday, 3 November 2026

మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పూజలు

జనంసాక్షి , మంథని : గురు పౌర్ణమి ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని శ్రీ పోతులూరి
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని శ్రీ మహా గణపతి దేవాలయాన్నిమంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సోమవారంసందర్శించారు. ఈ సందర్భంగా ఈ దేవాలయాలను సందర్శించిస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలను ఆమె నిర్వహించి
తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయకమిటీ, మంథని పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్చైర్ పర్సన్ పుట్ట శైలజ ను వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలోఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తంగళ్ళపల్లి మధుకర్, దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు గర్రెపల్లి సత్యనారాయణ, మోదుంపురం విజయ్, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుండోజు ప్రవీణ్, సిరికొండ నాగన్న, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పూసాల బాలాజీ, మియాపురం
శ్రీనివాస్, సదానందం, మల్లోజు బ్రహ్మం, ములకల రాజశేఖర్,కొమురోజు వేణు, మోరె సాయిరాం, సిరికొండ శ్రీనివాస్, మల్లోజురాజేందర్, బోగోజు రమేష్, కందుకూరి రామ్మూర్తి, ఆలయ అర్చకుడు మియాపురం భద్రయ్య, మహాగణపతి ఆలయ అర్చకుడు రాములతో పాటు తదితరులు పాల్గొన్నారు.