ఖమ్మం/వరంగల్/అచ్చంపేట ,మార్చి6(జనంసాక్షి):ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్, అచ్చంపేట మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.అచ్చంపేట మున్సిపాలిటీలో 18,614 మంది ఓటర్లకు గాను 13,193 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్, అచ్చంపేట మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 4 గంటల వరకు అచ్చంపేటలో 69.74 శాతం, ఖమ్మంలో 62.92 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 67.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2,65,710 ఓటర్లు ఉండగా.. 1,79,827 ఓట్లు పోలయ్యాయి. 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. 50 డివిజన్లలో మొత్తం 291 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈనెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 18,614 మంది ఓటర్లకు గాను 13,193 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 20వార్డుల్లో ఏర్పాటు చేసిన 20 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ నెల 9న ఫలితాలు వెలువడనున్నాయి. 15న ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అచ్చంపేట మున్సిపాలిటీకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది.ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ఖమ్మంలో 67.68 శాతం పోలింగ్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 67.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2,65,710 ఓటర్లు ఉండగా.. 1,79,827 ఓట్లు పోలయ్యాయి. 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. 50 డివిజన్లలో మొత్తం 291 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈనెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
అచ్చంపేటలో 70.88 శాతం పోలింగ్
అచ్చంపేట : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 70.88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ ఆర్డీవో దేవేందర్‌రెడ్డి తెలిపారు. 18,614 మంది ఓటర్లకు గాను 13,193 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 20వార్డుల్లో ఏర్పాటు చేసిన 20 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార తెరాస 20వార్డులకు పోటీ చేయగా.. కాంగ్రెస్, తెదేపా, భాజపా కలిసి కూటమిగా ఏర్పడి ప్రతివార్డులో కూటమి తరఫున ఒకే అభ్యర్థిని పోటీలో పెట్టారు. కాంగ్రెస్ 13, తెదేపా 4, భాజపా మూడు వార్డుల్లో అభ్యర్థులను నిలపగా మరో 17 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.





