ముప్కాల్ (జనం సాక్షి) ఏప్రిల్ 20 మండలంలోని పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టులో నిన్న సాయంత్రం భాస్కరాచారి బాధ్యతలను స్వీకరించారు 2020 బ్యాచ్ కు చెందిన ఆయన గతంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా పనిచేశారు ప్రభుత్వం కొంతకాలం కిందట ఇచ్చిన 317 జీవో ప్రకారం నిజామాబాద్ మూడవ స్టేషన్లో రెండవ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు తర్వాత కాలంలో వి ఆర్ కు అటాచ్ చేసిన ఆయనను కొంతకాలం తర్వాత ఇప్పుడు భాస్కరాచారి నీ ముప్కాల్ ఎస్సైగా బదిలీ చేశారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణలో మరియు ఎటువంటి రాజకీయ సమస్యలు లేకుండా అందరికీ ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశాడు




