హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్న తెలంగాణ సాధన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభా వేదికను కాంగ్రెస్ నేతలు గుత్తా సఖేందర్‌రెడ్డి, రాజయ్య, బసవరాజు సారయ్య సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ సాధన సభను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. నిజాం కళాశాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఉర్పాట్లు చేశారు. సభలో తెలంగాణపై కాంగ్రెష్ నేతలు తీర్మానం చేయనున్నారు. పది జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.




