బల్దియా శానిటేషన్ లో భారీ స్కామ్ లు బయటపడుతున్నాయి. మెటీరియల్ పై బిల్లుల డ్రా చేసిన ఇష్యూ మరవక ముందే మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. కార్మికులకు ఇవ్వాల్సిన మెటీరియల్ మెనూ చేంజ్ చేశారు అధికారులు, క్రాంటాక్టర్లు. హెల్త్ సేప్టీకి ప్రియారిటీ ఇవ్వకుండా తమ కొచ్చే లాభాలనే చూసుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులకు ఏటా అవసరమైనా మెటీరియల్ అందిస్తుంది బల్దియా. అయితే కొన్నేళ్లుగా వీటిని పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. బ్రాండెడ్ వస్తువులు ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లు, అధికారులు… నాసిరకం మెటీరియల్ కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు కార్మికులు. కమీషన్లు ఎక్కువొస్తాయనే ఆశతో సెకండరీ గ్రేడ్ మెటీరియల్ ఆర్డర్ చేశారంటున్నారు.
ఇక జీహెచ్ఎంసీ అధికారులు..కార్మికుల బాగోగులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు కార్మిక సంఘాల నేతలు. నాణ్యత లేని మెటీరియల్ ఆర్డర్ చేయడమంటే కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అంటున్నారు. ఒక్కోక్కటిగా బయటపడుతున్న శానిటేషన్ స్కాం అందరినీ కలవర పరుస్తోంది. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అందించిన వారిపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కార్మికులు.




