మోత్కూరు ఏప్రిల్ 20 జనంసాక్షి : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం మండలంలోని పొడిచేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు సర్పంచ్ పేలపూడి మధు రంజాన్ తోఫాను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధీటి సంధ్యారాణి, ముస్లిం సోదరులు, మహిళలు,రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




