ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తా…
నన్ను గెలిపించిన వారికి ధన్యవాదాలు.
ముస్లిం కమిటీ పట్టణ అధ్యక్షులు పాషా..
మెట్ పల్లి టౌన్,డిసెంబర్ 03, జనంసాక్షి:
ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తానని. ఏ సమయంలో అయినా సరే ప్రతి పనికి ముందు ఉండి సహాయం అందజేస్తానని సెంట్రల్ ముస్లిం కమిటీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా అన్నారు. శనివారం ఆయన మెట్పల్లి పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ. శుక్రవారం జరిగిన ముస్లిం కమిటీ ఎన్నికలలో తనపై నమ్మకంతో అత్యధికంగా ఓట్లు వేసి తన గెలుపుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ముస్లిం మైనార్టీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని. ముస్లిం ల అభివృద్ధి కోసం పోరాటం చేస్తానని తెలిపారు. పెండింగ్ లో ఉన్న షాదిఖానా, ఉర్దూ మీడియం పాఠశాల భవనం నిర్మాణం కోసం, ముస్లిం స్మశాన వాటిక, మసీద్ ల అభివృద్ధి కి ప్రత్యేక నిధుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు.




