Wednesday, 4 November 2026

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు
పానుగల్ డిసెంబర్03,జనంసాక్షి
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్ శనివారం రోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో విన్నవించినట్లు తెలిపారు.గద్వాల పట్టణంలో రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప కుమారుడి పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరినట్లు తెలిపారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిసెంబర్ 4న ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పట్టణానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు రఘుపతి నాయుడు,స్టీరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు ఉమ్మల్ల రాములు, జి రాములుతదితరులు పాల్గొన్నారు.