మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేసిన దేశెట్టి పాటిల్
జహీరాబాద్ డిసెంబర్ 3 ( జనం సాక్షి) జహీరాబాద్ పట్టణంలో జరిగిన క్రికెట్ టోర్నీ కార్యక్రమంలో పాల్గొన్న దేశెట్టి పాటిల్ క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినవారు పొంగిపోకుండా సహజమైన ఆటతో ముందుకు సాగాలని, ఒడినవారు కృంగిపోకుండా మెరుగైన ఆటతో నైతిక ధైర్యంతో తదుపరి ఆటల్లో మంచి ఆట తీరు ప్రదర్శించి విజేతగా నిలవడానికి సర్వశక్తులు ఒడ్డలని, తమ వంతుగా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ క్రీడాకారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఆటగళ్ళేవారు మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని ఆటగాళ్లను ఉద్దేశించి అన్నారు.. కార్యక్రమంలో విజయ్ రాథోడ్, అక్బర్ సహబ్, మొహమ్మద్ ముజిబ్, మొహమ్మద్ రహీం, నిర్వహకులు మొహమ్మద్ నాయిమ్, మొహమ్మద్ ఫెరోజ్, మొహమ్మద్ అక్బర్ మాజిద్ ఏ ఫిర్దోస్ సదర్, మొహమ్మద్ ముజఫ్ఫార్, అబ్దుల్లా సిద్దిఖి, మొహమ్మద్ యఫై, నవీన్ పాటిల్, మాక్సుద్ ఖాన్ఇస్మాయిల్ బిలాల్ పూర్, సద్దాం కుసంగి, విజయ్ రాథోడ్, అక్షయ్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేసిన దేశెట్టి పాటిల్




