మూడోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప,జూన్‌22(జ‌నం సాక్షి ): జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మురళీమోహన్‌, గల్లా జయదేవ్‌, మాగంటి బాబు, కేశినేని నాని, అవంతి, కొనకళ్ల, సీతారామలక్ష్మి, రవీంద్రబాబు, శివప్రసాద్‌, నిమ్మల కిష్టప్ప, గరికపాటి దీక్షకు సంఘీభావం తెలిపారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఈనెల 20 నుంచి జడ్పీ కార్యాలయ ఆవరణలో రమేష్‌ దీక్షకు దిగారు. రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్ష చేపట్టారు. రమేష్‌ దీక్షకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం కావాలనే కాలయాపన చేస్తోందని ఎంపీ రమేష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.