Tuesday, 3 November 2026

మూసి డ్యాం గేటును 48 గంటల్లో అమరుస్తాం 

– ఈ నెల 9 నాటికి జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తాం
– కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తాం
– ఆయకట్టు రైతాంగానికి మంత్రి జగదీష్‌ రెడ్డి భరోసా
– ప్రాజెక్టుపై నీటిపారుదల నిపుణులతో మంత్రి ప్రత్యేక సవిూక్ష
హైదరాబాద్‌,అక్టోబర్‌ 6(జనంసాక్షి):శనివారం రాత్రి కొట్టుకుపోయిన మూసి డ్యాం గేటును 48 గంటల్లో అమరుస్తామని  రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నాటికి మూసిని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.నీటి ఉధృతికి మూసి డ్యామ్‌ కు చెందిన ఆరో నంబరు గేట్‌ కొట్టుకుపోయిందన్న సమాచారం తో మంత్రి జగదీష్‌ రెడ్డి హుటాహుటిన శనివారం రాత్రి మూసి డ్యామ్‌ వద్దకు చేరుకుని పరిస్థితులు సమీక్షించారు. ఈ విషయమై మంత్రి జగదీష్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకురావడంతో పాటు పరిస్థితులను సవిూక్షించారు. ఈ క్రమంలో తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వ్యక్తి గత కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు నీటిపారుదల ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావులను ఉన్నఫలంగా ప్రాజెఉ్టను సందర్శించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఆఘమేఘాల విూద హెలికాప్టర్‌లో ఈ మద్యాహ్నం సూర్యపేటకు చేరుకున్న స్మితసబర్వాల్‌, మురళీధర్‌రావు లు రోడ్డు మార్గంలో మూసి డ్యామ్‌ వద్ద చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నీటిపారుదల ఇంజినీరింగ్‌ నిపుణులతోపాటు స్మితా సబర్వాల్‌, మురళీధర్‌ రావులతో మంత్రి జగదీష్‌ రెడ్డి డ్యామ్‌ విూదనే ప్రత్యేక సవిూక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిపుణులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న డ్యామ్‌ వివరాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం సవిూక్షించిన విూదట 1991 ప్రాంతంలో మూసి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు గేట్లను అదనంగా తయారు చేశామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో  తిరుపతిలో సవిూపంలో నిర్మిస్తున్న కల్యాణి డ్యామ్‌ కు తరలించడం జరిగిందని వాటిలో రెండు అక్కడ వినియోగించుకోగా మూడు మిగిలి ఉన్నాయని నిపుణులు మంత్రికి వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల సూచనతో తిరుపతి నుండి ఆ మూడు గేట్లు తెప్పించి 48 గంటల్లో అమర్చనున్నట్లు తెలిపారు. అంతే గాకుండా ఈ నెల 9 నాటికి మూసి డ్యామ్‌ మరమ్మత్తులు పూర్తి చేసి వృధాగా పోతున్న నీటిని నిలువరించనున్నట్లు వారు మంత్రికి తెలిపారు. ఇదే విషయమై మంత్రి జగదీష్‌ రెడ్డి సవిూక్షా సమావేశం అనంతరం విూడియాకు వివరాలు వెల్లడిస్తూ మూసి ఆయకట్టు రైతాంగానికి ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దని కోరారు. రైతాంగాన్ని అదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు అదేశించినందున వదంతులను నమ్మ వద్దని హితవు పలికారు. మూసి కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందించే ఏర్పాట్లు జరుగుతున్నందున రైతులు, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు .మంత్రి వెంట  ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌,నీటి పారుదల ఇ ఎన్‌ సి మురళీధర్‌ రావులు సవిూక్షలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ ,శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు ఉన్నారు.