మృతదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి
మోత్కూరు డిసెంబర్ 27 జనంసాక్షి : మోత్కూరు మండల నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి గుంటి అయిలయ్య తండ్రి కీ||శే రామ నరసయ్య మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి. వారితోపాటు….మార్కెట్ కమిటి చైర్మన్ యాకుబ్ రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్స్ పురుగుల వెంకన్న,బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మేఘారెడ్డి,మోత్కూర్ ,అడ్డగూడూరు బిఆర్ఎస్ మండల మండల పార్టీల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు,గజ్జి మల్లేష్, మర్రి అనిల్,ఆనందం,కోమటి మచ్చగిరి,బోడ శ్రీను, మల్లం అనిత,దబ్బేటి శైలజ, కట్ట ఇంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు.




