Friday, 6 November 2026

వియం బంజర్ఉన్నత పాఠశాలకు 2 లాప్ టాప్ లు బహుకరించిన ఐడియాస్ సంస్థ

వియం బంజర్ఉన్నత పాఠశాలకు 2 లాప్ టాప్ లు బహుకరించిన ఐడియాస్
సంస్థ

పెనుబల్లి,డిసెంబర్ 27(జనం సాక్షి)ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ తరపున వ్యవస్థాపకులు శౌరి, కో-ఆర్డినేటర్ అభి,మంగళవారం వియం బంజర్ ఉన్నత పాఠశాలకు 2లాప్ టాపులు బహుకరించారు.
433 మంది విద్యార్థులు ఉండి, అంకితభావంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేయడాన్ని, పాఠశాల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఎస్ ఎం ఎస్ సహకరించడాన్ని తాము గమనించామని,విద్యార్థులకు ప్రభావ వంతంగా డిజిటల్ లెసన్స్ చెప్పడం కోసం 2 లాప్ టాప్స్,వలంటీర్ ను ఇచ్చామని శౌరి వివరించారు.
ప్రధానోపాధ్యాయులు బి. నరసింహారావు తల్లిదండ్రులు, ఐడియాస్ సంస్థ తమపై ఉంచిన నమ్మకం ను నిలబెట్టుకుంటామని తెలిపారు. పాఠశాల సీనియర్ టీచర్ వనమా నాగేశ్వరరావు పాఠశాల కు బిఎస్ఎన్ఎల్ వైఫై సౌకర్యం కల్పించడం కోసం రు.5వేలు విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వరరావు, వివి రామారావు, వై. శ్రీనివాస్, ఉమారాణి, సోమ్లా నాయక్, కె ఎస్ఎస్.రాజు,పద్మలత,మునీరునీసా బేగం, సైదారావు, కృష్ణ నాయక్,కిరణ్ కుమారి పాల్గొన్నారు.