వరిలో బాటలు తీయడం వలన ప్రయోజనాలు
ఫోటో రైట్ అప్: అవగాహన కల్పిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులు
పెన్ పహాడ్. డిసెంబర్ 29 (జనం సాక్షి) :
వ్యవసాయ రైతులు వరిలో బాటలు తీయడం వలన అధిక లాభాలు సాధించవచ్చని అగ్రికల్చర్ విద్యార్థులు సూచించారు గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ సికింద్రాబాద్ లయోలా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులు , శ్రీ అరబిందో గ్రామ అభివృద్ధి సంస్థ కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి సమక్షంలో సింగారెడ్డి పాలెం గ్రామం నందు వరి పొలాలలో కాలిబాటలు తీయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నాట్లు వేసిన పొలాలలో పది రోజులలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలను తీయాలి అని వాటి ద్వారా గాలి ప్రసరణ బాగా జరిగి ఎక్కువ పిలకలు పెరగడం కాకుండా చీడపీడలు సోకే అవకాశం కూడా తక్కువ అని రైతులకు తెలిపినారు, అదేవిధంగా కాలిబాటల వల్ల ఎరువులు వేయటం మరియు పిచికారి చేయడం సులభం అవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయోలా కళాశాల విద్యార్థులు మణిదీప్ సూర్య వంశీ, బ్రుట్ జో, పి అరుణ్ కార్తీక్, ఎస్ ఎం షాకీర్, శుభం జోషి, ఫర్ దిన్ ఖాన్, ఎన్ బిపిన్ రాజ్ మరియు రైతులు రామారావు తదితరులు పాల్గొన్నారు




