భువనగిరిఖిల్లా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహనికిఘనంగా నివాళులు…..భువనగిరి టౌన్. ( జనం సాక్షి ):—సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 313 వర్ధంతి. భువనగిరి ఖిల్లా లో పాపన్న విగ్రహం వద్ద ఏప్రిల్ 2వసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 18 ఆగస్టు 1650 లో జన్మించారు, మరణం:- 2 ఏప్రిల్ 1710మొగల్ చక్రవర్తుల ఆగడాలను ఎదిరించి వీరుడు సర్దార్ పాపన్న బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి 12 మంది నుండి 12,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని 15 కోటలను నిర్మాణం చేసి ఎన్నో బావులు తవ్వించారు రేణుక ఎల్లమ్మ విగ్రహాలు ప్రతిష్టించారు. సర్దార్ పాపన్న 1710 లో గోల్కొండ కోటను జయించిన తర్వాత ఏడు నెలలు పరిపాలించారు. ఢిల్లీ మొగల్ సుల్తాన్ జీర్ణించుకోలేకపోయాడు ఒక బహుజన చక్రవర్తి గోల్కొండ కోట ను పరిపాలించడం. ఇది మాకు సిగ్గుచేటు అని భావించి పాపన్నతో యుద్ధం చేశారు పాపన్న తన సైన్యంతో వేల మందితో పోరాటం చేశారు ఆఖరి నిమిషంలో సర్దార్ పాపన్న ఒంటరిగా ఉండే ప్రాంతాన్ని తన స్నేహితులు మొగల్ చక్రవర్తులకు అందించడంతో పాపన్నను బంధించారు. పాపన్న ఎప్పటికైనా పేద ప్రజలకు బహుజనులకు అధికారం వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు అని పాపన్న శబదం చేసి తన వద్ద కత్తిని గాలిలోకి విసిరి గుండెలో దింపుకున్నాడు. ఈ విషయం ఢిల్లీ సుల్తాన్లకు చేరవేసి పాపన్న తలను ఢిల్లీకి పంపారు ఉండని గోల్కొండ కోటకి కట్టారు. పాపన్న గురించి ఎవరు ప్రస్తావించినా తలచిన మొగల్ చక్రవర్తులు ఎవరిని ప్రాణాలతో వదిలి పెట్టేవారు కాదు. ఇలా 10 సంవత్సరాల వరకు కొనసాగింది. సర్దార్ పాపన్న చరిత్రను లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. చరిత్రను గుర్తించి పంజాల జైహింద్ గౌడ్ గారు 2005లో మొట్టమొదటిగా సర్దార్ పాపన్న మహారాజు గారి విగ్రహం ప్రతిష్టించి సినిమా షూటింగ్ భువనగిరి కోటలో మొదలుపెట్టారు. ఒక విగ్రహంతో మొదలైన పోరాటం ఇవాళ దాదాపు 500 విగ్రహాల వరకు చేరుకున్నది. పంజాల జైహింద్ గౌడ్ దాదాపు 20 సంవత్సరాలు నుండి జయంతి ఉత్సవాలు సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్టు నుండి చేస్తున్నారు. పంజాల శ్రావణ్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న సేనను ముందుకు తీసుకెళుతున్నారు బహుజనులందరూ ఏకతాటికి మీదికి రావాలి సర్దార్ పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించాలని గీతా కార్పొరేషన్ 5000 కోట్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పాపన్న గురించి బహుజన వాదంతో మొగలురతో పోరాటం చేసి సర్దార్ అనే పేరు బిరుదు సర్వ య అని ప్రాణ స్నేహితుని పేరు పెట్టాలని స్నేహబంధం చాటి చెప్పిన పాపన్న గొప్ప మహనీయుడు సర్దార్ పాపన్న ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్ ,పిసిసి డెలిగేట్ మెంబర్ తంగరపల్లి రవికుమార్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ,గ్రంధాల చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు హరిశంకర్ గౌడ్ ,బిజెపి జిల్లా నాయకులు ఫోటోలు శ్యామ్ గౌడ్ ,పంజాల లోకేష్ గౌడ్ గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు ఉట్కూరి భరత్ గౌడ్ ,పడిగేల ప్రదీప్ ,అంగడి నాగరాజ్,
సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 313 వర్ధంతి…




