మృతురాలు కుటుంబానికి చేయూత
సర్పంచ్ శ్రీమతి వేల్పుల సరిత-తిరుపతి
మహ ముత్తారం జనవరి 11( జనం సాక్షి) మండలంలోనిపోలారం గ్రామానికి చెందిన ఆతుకూరి రజిత వారి కుటుంబానికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు పోలారం సర్పంచ్ శ్రీమతి శ్రీ వేల్పుల సరిత-తిరుపతి గారి ఆధ్వర్యంలో 11వ రోజు సందర్భంగా వారి కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని వారి చేతుల మీదుగా వారికి అందజేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని శ్రీమతి సర్పంచ్ వేల్పుల సరిత- తిరుపతి వర్ని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మంద ముత్తమ్మ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మందా సుధాకర్ వేల్పుల వెంకటయ్య పంగ దుర్గయ్య బోడ సదయ్య మంద రాజేందర్ మంద రాజు వేల్పుల రంజిత్ మంద రాజబాబు వేల్పుల శంకర్ మునిమంద ఎర్ర సమ్మయ్య పారిపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




