మెటలకుంట చర్చి సౌండ్ మిక్సర్ ను అందించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ డిసెంబర్ 22 (జనం సాక్షి) న్యాల్కల్ మండలం,మెటలకుంట గ్రామంలోని ‘యేసుక్రీస్తు ప్రార్ధన మందిరం’ చర్చి సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ పీటర్ రాజ్ కోరిక మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 50 వెయ్యిల రూపాయల విలువ గల “సౌండ్ మిక్సర్ ను అందచేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా స్వప్నభాస్కర్ మాట్లాడుతూ సాటివారికి చేయూతనిచ్చే సహాయం కన్నా మరొకటి లేదని,మండల అభివృద్ధికి కృషి చేస్తూ అన్నీ వర్గాల వారికి అండగా ఉండడమే తన లక్ష్యం అని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ పీటర్,మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజీ మండల అధ్యక్షులు పాండురంగరావు,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రవికుమార్,ఉపసర్పంచ్ వెంకటేష్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు,మండల సీనియర్ నాయకులు బస్వరాజ్ పాటిల్, రాజేందర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు రహీం,బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ లు, గ్రామ అధ్యక్షులు,పాస్టర్ భాస్కర్, గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు
మెటలకుంట చర్చి సౌండ్ మిక్సర్ ను అందించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్




