Thursday, 5 November 2026

మెట్ పల్లి నాయీ బ్రహ్మణ సేవ సహకార సంఘం ఎన్నికలు

మెట్ పల్లి టౌన్ జనవరి 18,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ నాయీ బ్రహ్మణ సేవ సహకార సంఘం ఎన్నికలు రాష్ట్ర కార్యదర్శి ముత్యాల రమేష్ మరియు ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
ఇట్టి ఎన్నికలలో
అధ్యక్షులుగా చిట్యాల సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా సమ్మెట రాజేష్ గెలుపొందగా ,
ప్రధాన కార్యదర్శిగా ధ్యాగేల్ల నవీన్, కోషాధికారి గా కొదురుపాక శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి ఎన్నికలు నిర్వహించిన వారిలో పగడాల శేఖర్, నడికుడ దశానందం, మద్దూరి బాలగంగాధర్, రాచకొండ లక్ష్మణ్, కొర్లాపు శ్రవణ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.