Wednesday, 4 November 2026

మెట్రో మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు

 

నరకం చూపిస్తున్న నగర రోడ్లు

హైదరాబాద్‌,ఆగస్ట్‌5(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ మెట్రో పనులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈపనులు ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కానీ ప్రస్తుతం మాత్రం తాము నరకం అనుభవిస్తున్నామని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల తరబడి రోడ్డుపైననే ఉండాల్సి వస్తోందన్నారు. చివరకు ఆర్టీసీ బస్సులో కూడా ఇదే దుస్తితి ఉందన్నారు. మెట్రో మార్గాల్లో రోడ్లు దారుణంగా ఉండడమే దీనికి కారణమన్నారు. మరోవైపు యూ టర్న్‌లు కూడా ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. కనీసం అరకిలోవిూటరు చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. తాజాగా

మెట్రో స్టేషన్‌ నిర్మాణ పనుల మూలంగా వాహనాల దారిమళ్లింపుతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో వచ్చే వాహనాలను మళ్లిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. వాహనాల దారి మళ్లింపుతో ట్రాఫిక్‌ నియంత్రణను పట్టించుకోవడం లేదు. మెట్రో మార్గంలో రోడ్ల గుంతలు పూడ్చి బాగు చేయాలని కోరుతున్నారు.

————–