నదిలోకి పిల్లలను తోసేసి హత్య

దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి

చిత్తూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గంగాధర నెల్లూరు మండలంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి తన ముగ్గురు పి/-లాలను స్థానిక నదిలో తోసి అంతమొందించాడు. భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను కన్నతండ్రే నదిలో పడేసిన విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. గంగాధర మండలం బాలగంగనపల్లికి చెందిన వెంకటేశ్‌ లారీడ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య అమరావతితో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన వెంకటేశ్‌.. అత్తగారింట్లో ఉన్న తన ముగ్గురు పిల్లలను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి చిత్తూరు రూరత్‌ మండలం దిగువ మాసాపల్లిలో సవిూపంలో నదిలో పడేసి పారిపోయాడు. ఈ విషయాన్ని భార్యకు తానే స్వయంగా ఫోన్‌చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన చిన్నారులను సంజయ్‌(5), పునీత్‌(4), రాహుల్‌(2)గా గుర్తించారు. ఈ ఘటనపై ఎస్సై రాజశేఖర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో తల్లితో పాటు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్ల మృతితో తల్లి శోకంతో తల్లడిల్లింది.

 

తాజావార్తలు