Sunday, 8 November 2026

మెట్ పల్లి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

మెట్ పల్లి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 22,
జనం సాక్షి :
గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మెట్పల్లి శాఖ ఖాతాదారుడైన మల్లాపూర్ గ్రామానికి చెందిన పడాల నడిపి రాజారెడ్డి ఇటీవల ఒక ప్రమాదంలో మరణించడంతో ఆయనకు ఖాతా ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు మంజూరు కాగా,
మల్లాపూర్ ఎమ్మార్వో
రవీందర్ ద్వారా నామిని అయినటువంటి భార్య పడాల వెంకటరాజుకు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు ఇవ్వడం జరిగింది .ఎమ్మార్వో రవీందర్ మాట్లాడుతూ ఖాతా ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచి పద్ధతి అని అది మెట్పల్లి గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు ప్రమాదవశత్తు బీమా ఒక లక్ష రూపాయలు ఉండడం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ బ్యాంకులో ఖాతా ద్వారా ఉచిత బీమా ఇన్సూరెన్స్ దానిని స్వదియోగం చేసుకోవాలని అలాగే ఈ బ్యాంకు నందు ఏటీఎంలో అన్ని వేళల నగదు ఉండడం జరుగుతుందని, కస్టమర్లకు ఇబ్బంది లేకుండా వారి సేవలు
ఖాతాదారులకు కనీస డిపాజిట్ తో ఇన్సూరెన్స్ సౌకర్యము పేద మరియు మధ్యతరగతి దారులకు ప్రమాద బీమా కల్పిస్తూ వారికి అండగా ఉండడం అర్శించదగ్గ విషయమని అన్నారు.
బ్యాంకు మేనేజర్ కేశ శివ కుమార్ మాట్లాడుతూ బంగారంపై లోను తక్కువ వడ్డీతో ఇవ్వబడును అలాగే పరిసరాల గ్రామాలలో 19 బ్యాంకింగ్ కరస్పాండెంట్ నియమించామని తద్వారా పెన్షన్లకు బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చు అని అన్నారు అలాగే, మైక్రో, ఏటీఎం, ఏఈపిఎస్ ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుందని,ఏఈపిఎస్ ద్వారా ఖాతా ఓపెన్ చేయడం జరుగుతుందని అలాగే
పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే యాప్ లు డౌన్లోడ్ చేసుకొని లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ,
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కేశ శివకుమార్, వన్నెల శేఖర్ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు