Sunday, 8 November 2026

విద్యార్థులు రామానుజా న్ని ఆదర్శంగా తీసు కోవాలి

విద్యార్థులు రామానుజా న్ని ఆదర్శంగా తీసు కోవాలి : శామీర్ పేట్, జనం సాక్షి :గురువారం శామీర్ పేటలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. గణిత శాస్త్రంలో ఉన్న ఆయన పాండిత్యం ద్వారా యావత్తు ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టను పెంచటం జరిగిందని అన్నారు. ఆయన పుట్టిన రోజును గణిత దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని , విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ ను ఆదర్శంగా తీసుకుని తమ పేరును తద్వారా దేశం కీర్తి ప్రతిష్టలను పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి , మేడి భాస్కర్, బత్తుల శశికాంత్ యాదవ్, మహ్మద్ గౌస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న దృశ్యం