మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ 1301508/-రూ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
పీఎంఆర్ఎఫ్ పథకం గురించి ప్రజలలో అవగాహన లేదని
అర్హులైన లక్షలాదిమంది
పేద ప్రజలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్(pmrf) నియోజకవర్గంలో ఒకరికి కూడా రాలేదని దాని గురించి అవగాహన లేక పేద ప్రజలకు సరియైన వైద్యం అందడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ,వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, వార్డు మెంబర్లు,
కో ఆప్షన్ సభ్యులు,బి ఆర్ఎస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎప్ చెక్కుల పంపిణీ




