Saturday, 7 November 2026

లంబాడీల ఆరాద్య దైవాల గద్దెలను కూల్చిన వారిని శిక్షించాలి

లంబాడీల ఆరాద్య దైవాల గద్దెలను కూల్చిన వారిని శిక్షించాలి
లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అద్యక్షులు కాట్రోత్ రవీందర్ నాయక్
జుక్కల్, నవంబర్ 27,(జనంసాక్షి),
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో బంజారా(లంబాడా) ప్రజలు స్థలం కోనుగోలు చేసి,ఆ స్థలంలో ఏర్పాటు చేసుకొన్న బంజారాల ఆరాధ్య దైవాలైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాతా జెండా గద్దెలను శనివారం కూల్చివేతకు పాల్పడిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లంబాడీల ఐక్య వేదిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అద్యక్షులు కాట్రోత్ రవీందర్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికీ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఇలాంటి సంఘటన జరగడం ధురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేత జరిగిన స్థలంలోనే ఆరాద్య దైవాల జెండాలను తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వెంటనే మా ధైవాల జెండా గద్దెలను పునర్నిర్మాణం చేయక పోతే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ధర్నా చేస్తామని లంబాడీల ఐక్యవేదిక టీం తరఫున ఆయన హెచ్చరించారు.