Tuesday, 3 November 2026

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి శిబిరం

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి శిబిరం
పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 30, జనంసాక్షి :
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పట్టణంలో ని రామాలయం ఫంక్షన్ హాల్లో మెగా ఉచిత మహా కంటి శిబిరం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,జడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొని కంటి శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి పేదవారికి లబ్ధి పొందేందుకు చాలా కార్యక్రమాలు చేశారని, పలు సేవా కార్యక్రమంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందని సొంత ఖర్చులతో పేదలకు సేవ చేయడం దాదాపు 20 సంవత్సరాల నుండి జరుగుతుందని ఇటువంటి పేదలకు సేవ భావంతో కార్యక్రమాలు చేస్తున్న మెట్పల్లి పట్టణ లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు, జడ్పీ ఛైర్మన్ దావ వసంత మాట్లాడుతూ మెట్పల్లి లైన్స్ క్లబ్ పేదవారికి వివిధ రకాల ఉన్నతమైన సేవల్లో ముందు ఉండటం పేపర్లో చదవడం జరిగింది అన్నారు ఈ రోజు ఉచిత కంటి శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 250 మంది కి రేకుర్తి డాక్టర్ లచే కంటి పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షల్లో కొందరికి ఆపరేషన్ నిమిత్తం ఇక్కడ నుండి రేకుర్తి వరకు ఉచిత బస్సు ద్వారా కంటి ఆపరేషన్ కు పంపించడం జరిగిందని మరికొందరిని మరోకసారి పంపించడం జరుగుతుందని, అలాగే కంటి ఆపరేషన్ లేని వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ను, జెడ్పీ చైర్మన్ ను మెట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గం, సభ్యులు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ , సెక్రటరీ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూర్ రాకేష్, జెడ్ సి కోట గంగా జీవన్, వడ్డేపల్లి శ్రీనివాస్, పోహర్ తుకారాం, కోటగిరి తిరుమలచారి,శశి,గడ్డం శంకర్ రెడ్డి,మహాజన్ శివకుమార్ , జోగ జగదీశ్వర్ ,దొంతుల ఆంజనేయులు,నాంపల్లి శ్రీనివాస్ , అశోక్,ఆనంద్ ,నర్సింగ్ రావు , ముద్దం ప్రసాద్,సునీత రావు, తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.