మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.

ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానం కూడా చేజారేలా కనిపిస్తోంది. ట్రెండ్స్ మొదలయ్యాక తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగిన ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం రెండోస్థానంలోకి దూసుకెళ్లారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫస్ట్ ప్లేస్‌కు దూసుకురాగా, కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలోకి వెళ్లారు. ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.