Thursday, 5 November 2026

15వ యూసుఫ్ కప్ ట్రోఫీలు ఆవిష్కరణ.

15వ యూసుఫ్ కప్ ట్రోఫీలు ఆవిష్కరణ.

ఆసక్తికరం గా మూడవ రోజు మ్యాచ్…

బూర్గంపహాడ్ జనవరి 14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం యూత్ ఆధ్వర్యంలో 15వ యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో టోర్నీ ట్రోఫీలను శనివారం ఆవిష్కరించారు. ప్రముఖ వ్యాపారవేత్త ట్రోఫీ స్పాన్సర్స్ డేగల రాజుయాదవ్ ట్రోఫీలను ఆవిష్కరించి కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అద్భుతమైన టోపీలు అందిస్తూ టోర్నమెంట్ కి వన్నె తెచ్చిన డేగల రాజు యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ సోహెల్ పాషా, గోనెల సర్వేశ్వరరావు, భజన సతీష్, అబ్దుల్ సలీం, సారధి, సత్తిపండు, పాత్రికేయులు మల్లారెడ్డి, దుద్దుకూరి రామకృష్ణ, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

– రసవత్తరంగా సాగిన మూడోరోజు మ్యాచ్.

15వ యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నమెంట్లో మూడవ రోజు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మొదటి మ్యాచ్లో సంతోష్ లెవల్ లక్ష్మీపురం జట్టుపై గియస్ 11 బూర్గంపహాడ్ విజయం సాధించింది.
రెండో మ్యాచ్లో మణుగూరు జట్టుపై పండు స్టైకెర్స్ కొత్తగూడెం విజయం సాధించింది.
మూడో మ్యాచ్లో లైన్స్ లెవెన్ పాల్వంచపై స్పైడర్ 11 భద్రాచలం విజయం సాధించింది. నాలుగువ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అక్బర్ 11 కుకునూర్ జట్టు నిర్ణీత ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 89 పరుగులు చేసింది. 90 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ చేసిన బ్లూ క్యాప్స్ భద్రాచలం జట్టు నిర్ణీత ఓవర్ గాను 95 పరుగులు చేసి విజయం సాధించింది.