భైంసా రూరల్ మే 01 జనం సాక్షి నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో నూతనంగా ఎన్నుకున్న మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొదలు ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి టిఆర్ఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫైల్ నేమ్ బైంసా మార్కెట్ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కరం అయ్యే దిశగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నూతన మార్కెట్ నిర్మాణానికి తగిన చర్యలు త్వరలోనే తీసుకొని మార్కెట్ కృషి చేస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందుబాటులో ఉండే విధంగా చూస్తామని ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాల అతిథంగా అందరికీ సమన్నుచిత న్యాయం చేస్తుందని తెలిపారు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను తీర్చే విధంగా తన వంతు కృషి చేయాలని కోరారు.




