జహీరాబాద్ మే 5( జనం సాక్షి)ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మార్పియస్ సంగారెడ్డి జిల్లా కొ-కన్వీనర్ మాతంగి చిరంజీవి అన్నారు.. మే 7న హైదరాబాద్ వస్తున్న సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఎం.ఎస్.పి కొ-కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ మూలసిద్ధాంతమైన “ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా” అనే ప్రధానమైన సిద్దాంతంపు స్ఫూర్తితోనే జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమానికి మద్దతునిచ్చి చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎమ్మార్పీయస్ డిమాండ్ చేస్తుంది అన్నారు. బెహాన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తే చారిత్రక ద్రోహం చేసినట్టే కాక, మాదిగలను మోసం చేసి చరిత్రలో ద్రోహం చేసిన పార్టీగా భావిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అబ్రహాం మాదిగ మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగుతున్న ఎమ్మార్పీయస్ ఉద్యమం పట్ల ఒక జాతీయ పార్టీగా ఉండి కూడా నేటికీ స్పందించకపోవడం విచారకరమన్నారు. బహుజన సమాజంలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నా, మాదిగల న్యాయమైన డిమాండును, ఆవేదనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా బెహాన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంపై దృష్టి సారించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో బీఎస్పీ పార్టీ మాదిగల్ని దూరం చేసుకున్న పార్టీగా మిగిలిపోతుంది అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి లేఖ ఇచ్చి రాష్ట్రం సిద్ధించేటందుకు చొరవ చూపిన బెహాన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోను సానుకూలంగా స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 7న హైదరాబాద్ వస్తున్న సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ ఉల్లాస్, సుకుమార్, బబ్లు, మోహాన్, ఎంఎస్పి జహీరాబాద్ కన్వీనర్ జైరాజ్, రజినీలు పాల్గొన్నారు




