Tuesday, 3 November 2026

మే డే పోస్టర్ల ఆవిష్కరణ.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మే డే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరాం సింగ్ మాట్లాడుతూకార్మిక అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో అంతర్జాతీయ కార్మికుల సంఘీభావ దినం 137 వ మే డే దినోత్సవం జరుపుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గమంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, ఆర్టీసీని, సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని తెలంగాణ రాష్ట్రం రాకముందు చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, తీరా ఇప్పుడు ఆర్టీసీని, సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక వాగ్దానాలు చేసినారు, కానీ వారికి ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడిపించాలని లేనియెడల కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో టిఎన్టియుసి నాయకులు బొల్లు మల్లయ్య, ఎండి హసన్, తిరుపతి, హరి కిషన్ పాండే, టీడీపీ జిల్లా కార్యదర్శి ఓ జీవరత్నం, గంగాధర్ గౌడ్, దూట రవి, గోకర్ల శేఖర్ పాల్గొన్నారు.