:శామీర్ పేట్, జనం సాక్షి :
బుధవారం శామీర్ పేట లో ని గురుకుల మైనారిటీ పాటశాల లో కైట్ ఫెస్టివల్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు సరదా గా పిల్లల తో పతంగీలు ఎగురవేయటం అద్భుతంగా ఉందని అన్నారు. అంతక్రితం విద్యార్దులకు మైనారిటీ నాయకులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ క్రిష్ణ మాట్లాడుతు విద్యార్థుల కు ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు.అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు కేసిఆర్ రాష్ట్రం లో మైనారిటీ గురుకుల పాఠశాల లతో దేశం లో నే ఒక చారిత్రక కార్యం చేశారని, వారి ఆలనా పాలనా సజావుగా చూసే ఉపాధ్యాయులు అభినందనీయమని అన్నారు. తల్లి తండ్రుల ను ఒప్పించి మైనారిటీ పాటశాల లో పిల్లలను చేర్పించడానికి మైనారిటీ నాయకులు కృషి అవసరమని అఫ్జల్ ఖాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. విజిలెన్స్ అధికారులు అబ్దుల్ రెహ్మాన్,షఫీ మాట్లాడుతు మైనారిటీ గురుకుల పాఠశాల లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి తో పాటు జిల్లా కోఆప్షన్ సభ్యులు మహ్మద్ జహీర్, ఎంపిటిసి డపు సాయి బాబా, షేక్ చాంద్ పాషా, మహ్మద్ అన్వర్ పాషా, మహ్మద్ గౌస్, మహ్మద్ ఇర్ఫాన్ ,వైస్ ప్రిన్సిపాల్ ఉమ, ఉపాధ్యాయులు సామ్యుల్,ఫయాజ్ కుమార్, రఫత్ ,అంజని ,ఇమ్తియాజ్ అహ్మద్, ఆసిఫ్,సమద్ తదితరులు పాల్గొన్నారు.
18ఎస్పీటి -1: గాలిపటం ఎగురవేస్తున్న దృశ్యం
మైనర్టీల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం




