మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ పటిష్ఠానికి రెండు వేల కొత్త టవర్లు

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి

హైదరాబాద్‌: గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు 2వేల కొత్త టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి ప్రకటించారు. రూ. 3వేల కోట్ల వ్యయంతో ఈ సిగ్నల్‌ వ్యవస్థను మారుమూల గ్రామాలకు విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు. ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై ఫ్యాప్సీ వ్యాపారవేత్తలతో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కిల్లి కృపారాణి రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మరోవైపు ఐటీ ఎగుమతుల్సి పెంచేందుకు ఐటీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల ఈ రంగం నుంచి అత్యధిక మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో 39శాతం ఐటీ రంగం నుంచే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.