Monday, 2 November 2026

మోడీ మోత..!

న్యూఢిల్లీ (జ‌నంసాక్షి): ఈ మధ్య పెట్రోలు, డీజీలు ధరలు తగ్గించి ఏదో మంచి చేశాడు అనుకుంటుంటె భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పుడే మోత మొగించాడు. పెట్రోలు, డీజీలు ధరలను అమాంతం పెంచేశాడు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్న ముడి చమురు ధరలకు, దేశంలో ధరలను తగ్గించిన దానికి ఏ మాత్రం పొంతనలేదని, సగానికి సగం తగ్గించాల్సిన ధరలను మొక్కుబడిగా తగ్గించి మోసం చేస్తున్నారని కేంద్రం మీద విమర్శలు ఉన్నాయి. ఇవి ఇలా ఉండగానే ..బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెంచేశారు.సామాన్యాడికి మేలు చేసే బడ్జెట్ ఇచ్చాం అంటూనే సామాన్యుడికి భారంగా ధరలు పెంచారు. లీటర్ పెట్రోలు మీద రూ.3.18, లీటర్ డీజిల్ కు రూ.3.09 పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుండే అమల్లోకి రావడం విశేషం. ఒక్కసారిగా ధరలు పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అలాగే ఉన్నా ఇక్కడ ధరలు పెరగడం మీద విమర్శలు గుప్పుమంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *