త్వరలో పవన్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లనున్న బాబు?
హైదరాబాద్, మార్చి 01: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి సంబంధించిన కేటాయింపులు, రాజధాని భూసమీకరణ, తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ర్టాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే సీఎం బాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.




