-పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్.
-దశాబ్ది ఉత్సవాల మీద ఉన్న చిత్తశుద్ధి విద్యారంగం పై పెట్టండి
కురవి జూన్ /23/ జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మోదుగుల గూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం చేసినా తరువాత విద్యార్థులు నీళ్ల లేక దాహం తీరక నీళ్ల కోసం బయట దుకాణంలో మంచి నీళ్లు తీసుకొని రావలసిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దశాబ్ది ఉత్సవాల మీద ఉన్న చిత్తశుద్ధి విద్యా రంగంపై లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మోదుగుల గూడెం జిల్లా పరిషత్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని లేనియెడల భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు





