జనంసాక్షి, మంథని : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత ఏర్పడడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ ను మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు కలిసి తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ దాన్యం తరలించడానికి లారీలను సేకరించవలసిందిగా ఆర్టిఏను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి స్థానిక పోలీసుల సహకారంతో రైతులు, పి ఎ సి ఎస్ సిబ్బంది, రైతు సంఘం నాయకులతో కలిసి మంథని పాత పెట్రోలు బంకు వద్ద లారీలను నిలిపివేసి కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లు కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి తెలిపారు.
లారీల కొరత తీర్చేందుకు అధికారుల చర్యలు




