మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ గా జగిత్యాల వైద్యురాలు
జగిత్యాల టౌన్ ( జనంసాక్షి) 27 అక్టోబర్
జగిత్యాల పట్టణంలోని భారతి హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రాచకొండ నాగరత్న ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ 2022 తో పాటు మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ టాప్ 4 గా ఎంపికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జే ఆర్ సీ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా చేతుల మీదుగా ఆదివారం ఈ అవార్డు లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఇమ్మాడి శివ కుమార్, నిజామాబాద్ ఎంఎల్ఏ బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఇతర కమిటీ సభ్యులు, మిత్రబృందం, భారతి హాస్పిటల్ సిబ్బంది వారి బంధువులు పాల్గొన్నారు.




