Thursday, 5 November 2026

మౌలిక వసతుల కల్పనకు కృషి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై 11.
డివిజన్ ప్రజలకు కావలసిన మౌలిక వసతులకు కృషి చేస్తున్నామని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.సోమవారం బీహార్ బస్తి,అయ్యన్నగర్ లో పవర్ బోర్ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.రెండు బస్తీలలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సమస్యను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఆయన అధికారులతో చర్చించి పవర్ బోర్ వేయించారని దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కార్పోరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మేకల రాము యాదవ్,స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.