హైదరాబాద్: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా…మీకోసం యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలలో విభేదాలుంటే ఎవరైనా విమర్శించవచ్చని, అయితే ఆ పార్టీ కార్యకలాపాలను అడ్డు కోవడం తగదని ఆయన తెలిపారు. తెలంగాణ ఇవ్వకుండా నన్చుతున్న కాంగ్రెస్‌పై అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలే తప్ప, తెలంగాణపై సానుకూలంగా ఉన్న ప్రతిపక్షాలపై కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీలు తమ బాణాలను కాంగ్రెస్ వైపే గురిపెట్టాలని ఆయన కోరారు. ప్రజల వద్దకు వెళ్లే హక్కు ఏ పార్టీకైనా ఉందని, అయితే వారిని ఎలా స్వీకరించాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.




