Tuesday, 3 November 2026

యాదగిరిగుట్టలో జగన్మోహిని అలంకార సంబరం

యాదగిరిగుట్ట, నల్గొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో కొనసాగుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్ర¬్మత్సవాల్లో గురువారం స్వామిని జగన్మోహిని రూపంలో అలంకరించారు. అనంతరం తిరువీధి సేవోత్సవాన్ని శాస్‌ోక్తంగా చేపట్టారు. బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకోవడంతో యాదగిరీశుని ఉత్సవాల విశిష్టతను తెలియజేసేలా ¬మాది పూజలు, అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అలంకారోత్సవాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. తిరువీధి సేవోత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. రాత్రికి జరగనున్న ఎదుర్కోలు ఉత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఆలయ కమిటీ చెప్పింది. ఆలయ ఈవో ఎన్‌.గీత, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి ఈ వేడుకలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *