న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 400రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో 2015-16గాను ఆయన రైల్వే బడ్జెను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రైళ్లలో అందుబాటులో ఉండేవిధంగా తక్కువ ధరకే రక్షిత మంచి నీరందించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన రైల్వేస్టేషన్లలో రూ.120కోట్లతో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం 67 శాతం నిధులను కేటాయించనున్నట్టు తెలిపారు. నగరాల్లో రద్ధీగా ఉన్న రైల్వే స్టేషన్లకు అనుబంధంగా కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించటంతోపాటు నగరాల శివార్లలో శాటిలైట్ రైల్వేస్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.





