రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నల్లగొండ జ్లిలాలోని లంబాపూర్, పెద్దగట్టు, చిత్రియాల్‌లో 1992-2012 కాలంలో ఎఎండీ యూరేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టింది. దాదాపు 18 వేల 550 మెట్రిక్ టన్నుల యూరేనియం నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడం జరిగింది. హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున నాగార్జునసాగర్ డబ్ల్యూఎల్‌లోని చింత్రియాల్ ప్రాంతంలోని అదనపు 50 చదరపు కిలోమీటర్ల పైబడి సర్వే, తనిఖీ, బోర్లను తవ్వడం కోసం హైదరాబాద్‌లోని ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకునికి 2012లో అనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా నల్లమలలో యూరేనియం నిక్షేపాలు ఉన్నా వాటిని వెలికితీసేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వబడదన్న షరతుతో 2016లోనే అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు వెలువరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. ఇవ్వబోదు అనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.




