•దోమ సర్పంచ్ కే.రాజిరెడ్డి.
దోమ జనవరి 18(జనం సాక్షి)
యువకులు క్రీడాల్లో రాణిస్తూ ఉన్నత క్రీడాల్లో రాణించాలని దోమ సర్పంచ్ కే.రాజిరెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మయ్య,పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్, అన్నారు. బుధవారం దోమ గ్రామ యువకులకు తన స్వంతగా రెండు వాలీబాల్లు, వాలీబాల్ నెట్ ను యువకులకు అందజేశారు.ఈ సందర్బంగా యువకులు చదువుతో పాటు క్రీడాల్లో రాణిస్తూ శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవలన్నారు.ప్రతి ఒక్కరు క్రీడాల్లో రాణించి తల్లిదండ్రులకు గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.అనంతరం యువకులతో కలిసి సర్పంచ్,పార్టీ అధ్యక్షులు వాలీబాల్ క్రీడాను ప్రారంభించి సరదాగా కాసేపు ఆడారు.ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు.




