యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలో కుషాయిగూడ నేతాజీనగర్‌లో కూలి పనికని తీసుకెళ్లి సరిత అనే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీపులు ఫిర్యాదు చేసింది. పరీక్షల కోసం యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు దుండగుల పరారీలో ఉన్నట్లు, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.