యువతి అపహరణకు యత్నం

– కిడ్నాప్‌కు యత్నించిన యువకుడికి దేహశుద్దిచేసిన స్థానికులు
– బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో ఘటన
గుంటూరు, జనవరి14(జ‌నంసాక్షి) : భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతున్న ఓ వయుతిని కిడ్నాప్‌ చేసేందుకు ఇద్దరు యువకులు తెగించడం స్థానికంగా సంచలనమైంది. గుంటూరు జిల్లా బాపట్లలోని  కోళ్లమూడివారి వీధిలోఈ ఘటన చోటుచేసుకుంది. సదరు యువతి తన సోదరితో కలిసి సోమవారం తెల్లవారు జామున తమ ఇంటి ముందు ముగ్గులు వేస్తోంది. అదే సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. ఒకరు బండిపై ఉండగా.. మరొక వ్యక్తి యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లే యత్నం చేశారు.. దీంతో యువతి ప్రతిఘటించడంతో బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.. పక్కనే ఉన్న సోదరి గట్టిగా కేకలు వేయడంతో యువతిని వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు.. అయితే బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు పారిపోతున్న దుండగులను వెంబడించారు. యువకుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సవిూపంలోని సీసీ కెమెరాలలో నమోదు కావడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. పారిపోయిన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. పండగ పూట ఈ ఘటన చోటు చేసుకోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురయ్యింది.