Tuesday, 3 November 2026

యువతి గొంతు కోసిన యువకుడు

మంచిర్యాల,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్‌ కి చెందిన కమలాకర్‌ అనే యువకుడు కార్‌ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. కమలాకర్‌కు కాసిపేట మండలం దేవాపూర్‌ కి చెందిన సల్మా అనే యువతితో పరిచయం ఏర్పడింది. అయితే మూడు నెలల కిందట సల్మాకు వేరే వ్యక్తితో పెళ్లయింది. సల్మా రెండు రోజుల కిందట రామకృష్ణపూర్‌ లో ఉన్న తన సోదరి ఇంటికొచ్చింది. గురువారం ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు కమలాకర్‌..తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నావని సల్మాతో గొడవ పడ్డాడు. కమలాకర్‌ కోపంలో మందు బాటిల్‌ పగులగొట్టి సల్మా గొంతు కోశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరినీ మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.